- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడు ఇండియాలోనూ "రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్".. అద్దె ఎంతంటే?
జపాన్‌లోని రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పై కొద్దిరోజుల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టైంపాక్ కోసం, లేదా అవసరానికి అక్కడ బాయ్ ఫ్రెండ్స్ అద్దెకు దొరుకుతారని, కావాలంటే బుక్ చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌లోని రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పై కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టైంపాస్ కోసం, లేదా అవసరానికి అక్కడ బాయ్ ఫ్రెండ్స్ అద్దెకు దొరుకుతారని, కావాలంటే బుక్ చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇండియాలోకి సైతం ఆ కాన్సెప్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని పంచుకుంటూ ఢిల్లీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇషా భల్లా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. కోపార్ట్‌నర్ అనే వెబ్ సైట్ నుండి తాను బాయ్ ఫ్రెండ్‌ను బుక్ చేసుకున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను సైతం షేర్ చేసింది. మొదట ఇద్దరూ ఒకచోట కలుసుకోగా కలిసి షాపింగ్ వెళ్లారు. షాపింగ్ లో తనకు తన అద్దె బాయ్ ఫ్రెండ్ ఎంతో సహాయం చేశాడని ఇషా చెప్పింది.
తన బ్యాగులు మోశాడని, ఓపికగా తాను చెప్పిన మాటలు విన్నాడని తెలిపింది. అంతే కాకుండా తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడుతూ తాను ఎమోషనల్ అయినప్పుడు అద్దె బాయ్ ఫ్రెండ్ ఓదార్చడానికి ప్రయత్నించాడని చెప్పింది. తనను నవ్వించడానికి ఎంతో ప్రయత్నించాడని తెలిపింది. తరవాత అద్దె బాయ్ ఫ్రెండ్ డబ్బులు తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు. నిజానికి ఇది ఒక ప్రమోషనల్ వీడియో కానీ ఇండియాలోనూ వెబ్ సైట్ అందుబాటులో ఉండటంతో ఇషా ప్రమోషన్ చేసింది. ఇక బాయ్ ఫ్రెండ్ ను ఎలా బుక్ చేసుకోవాలో కూడా డీటెయిల్ గా చెప్పింది. మొదట కోపార్ట్‌నర్ అనే వెబ్ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలని తెలిపింది.
ఈ వెబ్ సైట్‌లో చాలా రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని.. స్నేహితులతో గడపడం,క్లబ్బింగ్, సినిమా చూసేందుకు అద్దెకు భాగస్వామి, షాపింగ్ కు వెళ్లేందుకు, ఇంట్లో సహాయం చేసేందుకు, ట్రావెలింగ్ కోసం ఇలా రకరకాల సేవలకు బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారని చెప్పింది. వీటిలో సర్వీస్‌ను బట్టి రూ.1000 నుండి రూ.1500 మధ్య ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అద్దెకు వచ్చిన బాయ్ ఫ్రెండ్ ఆ తరవాత కాస్త సన్నిహితంగా దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తే ఏంటి పరిస్థితి అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అబ్బాయిలు ఆటోల్లాంటోళ్లు ఒకరిని పిలిస్తే వందమంది వస్తారు దానికి అద్దె అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.






