- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాసమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులతో కలిసి పర్యటించారు.

దిశ, రాజేంద్రనగర్ : మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి, స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యల పై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆరా తీశారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూసిన ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల కల్పన పై తక్షణమే దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే మా ప్రాధాన్యత అని కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతుల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ పర్యటనలో అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లయ్య జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్, నాయకులు ధనంజయ్ ప్రేమ్ గౌడ్ సరికొండ వెంకటేష్, బాస శ్రీనివాస్, అధిక్యూ అర్జున్, లక్ష్మారెడ్డి, బండారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






