పెట్రోల్ ధరలు పెరిగితేనేం.. రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం: బుడ్డోడి తెలివికి నెటిజన్లు ఫిదా!

by Gantepaka Srikanth |

ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఓ సామాన్య బాలుడు కనిపెట్టిన వినూత్న పరిష్కారం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

పెట్రోల్ ధరలు పెరిగితేనేం.. రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం: బుడ్డోడి తెలివికి నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఓ సామాన్య బాలుడు కనిపెట్టిన వినూత్న పరిష్కారం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఒక చిన్న బాలుడు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, రోడ్డుపై ఒక పెద్ద మేకపై కూర్చుని (Goat Riding) దర్జాగా ప్రయాణిస్తూ కనిపించాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, బాటసారులు ఈ వింత రైడింగ్‌ను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెద్ద పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చాయి కానీ, ఈ 'గ్రీన్ ఎనర్జీ వెహికల్'కు చార్జింగ్ కూడా అవసరం లేదు. రోడ్డు పక్కన కాస్త పచ్చగడ్డి కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా రీచార్జ్ అయిపోతుందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.


Next Story