మంగ్లీ కేసులో సిట్ ఏర్పాటు చేయాలి : న్యాయవాది సుబ్బు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-06 13:40:17  IST  )

మైక్రో ఫైనాన్స్ లో భారీ ఆర్థిక మోసానికి గురైన మంగ్లీ కేసు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున న్యాయవాది సుబ్బు డిమాండ్ చేశారు.

మంగ్లీ కేసులో సిట్ ఏర్పాటు చేయాలి :  న్యాయవాది సుబ్బు
X

దిశ, హిమాయత్‌నగర్‌ : మైక్రో ఫైనాన్స్ లో భారీ ఆర్థిక మోసానికి గురైన మంగ్లీ కేసు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున న్యాయవాది సుబ్బు డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడంపై తీవ్ర ఆందళన వ్యక్తం చేశారు. శనివారం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు స్పందించడం లేదని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు మృతి చెందారని, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. బాధితులకు అండగా నిలుస్తామని గతంలో ప్రకటించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు మౌనం ఎందుకు పాటిస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసులో ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయం సీఎం దగ్గరికి తీసుకెళ్లి బాధితుల న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తానని తెలిపారు.

Next Story