- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఐదు ఉద్యోగ సంఘాలకు ఓడీ ఫెసిలిటీ.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 17 ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పటికే అదర్ డ్యూటీ(ఓడీ) ఫెసిలిటీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 5 ఉద్యోగ సంఘాల అధ్యక్షులకు సైతం ఓడీ సౌకర్యాన్ని కల్పించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 17 ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పటికే అదర్ డ్యూటీ(ఓడీ) ఫెసిలిటీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 5 ఉద్యోగ సంఘాల అధ్యక్షులకు సైతం ఓడీ సౌకర్యాన్ని కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఓడీ ఫెసిలిటీని రోటేషన్ విధానంలో వినియోగించుకోవాలని సూచించింది. వీటిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ), తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్టీఎఫ్), గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్), తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(సెంట్రల్ అసోసియేషన్), ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్యూటీ), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్(ట్రెసా), తెలంగాణ క్లాస్-4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యూనిటైడ్ టీచర్స్ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్(టీజీఎస్ఏ) అధ్యక్షునితోపాటు 17 మందికి ప్రభుత్వం ఓడీ ఫెసిలిటీని కల్పించిన విషయం తెలిసిందే. మొత్తం 22 ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఫెసిలిటీ కల్పించింది.






