మహేష్ తర్వాత నచ్చిన నటుడు అతనే.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన జయకృష్ణ ఘట్టమనేని

by Pulgam srinivas |

రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడతారని జయకృష్ణ అన్నారు.

మహేష్ తర్వాత నచ్చిన నటుడు అతనే.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన జయకృష్ణ ఘట్టమనేని
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో వెండితెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూలై 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో జయకృష్ణనుసహజంగానే మహేష్ బాబు నటన మీకు ఇష్టం ఉంటుంది. ఆయన కాకుండా తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ... మహేష్ బాబు తర్వాత నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం.

ఆయన నటన నన్నెంతో ఆకట్టుకుంటుంది. ప్రతి సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడతారని చెప్పారు అలాగే 'పెద్ది' సినిమా చూశారా? అనే ప్రశ్నకు స్పందించిన జయకృష్ణ, చూశాను. ఆ సినిమాలో కూడా రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచారని ప్రశంసించారు. ప్రస్తుతం జయకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో జయకృష్ణ సరసన రషా తడానీ హీరోయిన్‌గా నటించగా, అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ (జెమిని కిరణ్) నిర్మించారు.

Next Story