- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చర్చలకు ప్రతిష్టలు అడ్డురావు': మరోసారి విద్యార్థులకు కేంద్రం పిలుపు
'నీట్' పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకులను, విద్యార్థుల ప్రతినిధులను మరోసారి చర్చలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: 'నీట్' పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకులను, విద్యార్థుల ప్రతినిధులను మరోసారి చర్చలకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి పట్టింపులకు లేదా ప్రతిష్టలకు పోవడం లేదని జితేంద్ర సింగ్ తెలిపారు. "కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో గానీ, లేదా ఆయన ఆఫీస్‌లో గానీ చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటోంది" అని ఆయన స్పష్టం చేశారు.
కాగా, నిన్న (బుధవారం) మధ్యాహ్నం కూడా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి నాయకులను చర్చలకు ఆహ్వానించింది. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను విద్యార్థి సంఘాలు తిరస్కరించాయి. "చర్చలు జరపాలనే ఉద్దేశం ఉంటే అధికారులు, మంత్రులే తాము ఆందోళన చేస్తున్న నిరసన స్థలి (జంతర్ మంతర్ వద్దకు రావాలి" అని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ పట్టు వీడకపోవడం, మరోవైపు కేంద్రం స్పందిస్తూ మళ్లీ చర్చలకు పిలుపునివ్వడంతో ఈ తాజా ఆహ్వానంపై విద్యార్థి నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.






