అప్పుడే ఎక్కడికి పారిపోతున్నావ్? CJP వ్యవస్థాకుడు అభిజీత్‌ దీప్కేను అడ్డుకున్న ప్రజలు

by Prasad Jukanti |

కాక్రోచ్ పార్టీ తలపెట్టిన మొదటి కార్యక్రమంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. జంతర్ మంతర్ వద్ద నిర్వహకుల తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అప్పుడే ఎక్కడికి పారిపోతున్నావ్?  CJP వ్యవస్థాకుడు అభిజీత్‌ దీప్కేను అడ్డుకున్న ప్రజలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ తొలి కార్యక్రమంలోనే తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP చేపట్టిన ధర్నాలో మొదటి నుంచి హైడ్రామా కొనసాగింది. కార్యక్రమం నిర్వహించిన తీరు, నిర్వాహకుల వైఖరి పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నీట్, సీబీఎస్‍ఈ అవకతవలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని సీజేపీ పార్టీ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఇవాళ ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జంతర్ మంతర్ చేరుకున్న అతడు అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

అప్పుడే ఎక్కడికి పారిపోతున్నావ్?

అయితే ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు ఉదయం 10 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చారు. అభిజీత్ పిలుపు మేరకు వందలాది మంది జంతర్ మంతర్ వద్ద ఇవాళ ఉదయం నుంచే నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అనుమతించిన సమయం మిగిలి ఉండగానే అక్కడి నుంచి అభిజీత్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ప్రజలు అతడిని అడ్డుకున్నారు. అప్పుడే ఎక్కడికి పారిపోతున్నావని నిలదీశారు. దీంతో దీప్కే తన కారులోంచి కిందకు దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వేదికపై కూడా సరైన క్రమశిక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వేడీ కారణంగా ఏసీ కూలింగ్ కోసమే అభిజీత్ కారులో కూర్చున్నట్లు ఆయన మద్దతు దారులు చెబుతున్న మాటలు వైరల్ అవుతున్న వీడియోలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం నుంచి రాని స్పందన:

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. మంత్రి రాజీనామా చేసే వరకు విరమించేది లేదని చెబుతున్నప్పటికీ గడువు ముగియకముందే నేతలు ఎవరి దారిని వారు చూసుకోవడం ఇప్పుడు చర్చగా మారింది. తలపెట్టిన మొదటి కార్యక్రమానికి హాజరైన వారు కూడా గతంలో మిగతా నిరసనల్లో పాల్గొన్నవారే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాక్రోచ్ ఉద్యమం పాల పొంగులాంటిదని అక్కడ అసలైన బాధితులెవరూ లేరనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామంటున్న కాక్రోచ్ పార్టీఈ ధర్నాతో ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వకపోతే తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది ఉత్కంఠగా మారింది.

నిరసన మాటున వ్యాపారం!:

సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఫలితం ఎలా ఉండబోతోందో తెలియనప్పటికీ ఇక్కడ జరిగిన వ్యాపారంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ యువకుడు ఉదయం 9 గంటలకు ఓ మీడియాతో మాట్లాడుతూ తాను సీజేపీ సపోర్టర్ కాదని కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చానని చెప్పాడు. అదే వ్యక్తి మళ్లీ 11 గంటలకు మాట్లాడుతూ తాను సీజేపీ సపోర్టర్ నని అందువల్ల ఇక్కడ టీ షర్టులు అమ్ముతున్నానని చెప్పాడు. ఒక్కో టీ షర్ట్ ను రూ. 250 చొప్పున విక్రయిస్తున్నానని చెప్పగా మరో వ్యక్తి కాక్రోచ్ మాస్క్ లను విక్రయిస్తూ కనిపించాడం. దీంతో ఈ ప్రొటెస్ట్ ఎలా ఉన్నా వ్యాపారం సాఫీగా జరిగిందే టాక్ వినిపిస్తోంది.

Next Story