100 ఇళ్లు కూల్చివేతకు యత్నం.... విజయవాడ రూరల్‌లో తీవ్ర ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. ..

100 ఇళ్లు కూల్చివేతకు యత్నం.... విజయవాడ రూరల్‌లో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ రూరల్ మండలం(Vijayawada Rural Mandal) నిడమానూరు(Nidamanuru)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైల్వే ఫ్లైఓవర్(Railway flyover) నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. దాదాపు వంద కుటుంబాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం వద్దంటూ రెండు రోజులుగా బాధిత కుటుంబాలు నిరసనలు చేప‌ట్టారు. ఇళ్లు కూల్చివేతకు పొక్లైన్స్‌‌కు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తమతో ఓట్లు వేయించుకొని గెలిచి.. త‌మకే గూడు లేకుండా చేస్తారా అంటూ మండిపడ్డారు. తమను చంపి కూల్చేయండంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story