జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా

by Jakkula.Mamatha |

సర్కారు భూముల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, జవహర్ నగర్‌లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కబ్జాదారుల పై ప్రత్యేక నాజర్ పెడుతున్నామని కాప్రా తహసీల్దార్ మతిన్ హెచ్చరించారు.

జవహర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా
X

దిశ, జవహర్‌నగర్: సర్కారు భూముల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, జవహర్ నగర్‌లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, కబ్జాదారుల పై ప్రత్యేక నాజర్ పెడుతున్నామని కాప్రా తహసీల్దార్ మతిన్ హెచ్చరించారు. జవహర్ నగర్‌లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు శనివారం గిర్ధావర్ సత్యనారాయణ సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను కాపాడుతామని, పేద ప్రజలు ప్రభుత్వ భూములు కొని మోసపోవద్దని సూచించారు. వికలాంగుల కాలనీ, మోహన్ రావు కాలనీ, సంతోష్ నగర్, డెంటల్ కాలేజీ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను జేసీబీతో నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story