- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిపురారం హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
త్రిపురారం మండలంలోని ఓ వ్యవసాయ బావిలో లభించిన మహిళ మృతదేహం మిస్టరీని త్రిపురారం పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.

దిశ, త్రిపురారం : త్రిపురారం మండలంలోని ఓ వ్యవసాయ బావిలో లభించిన మహిళ మృతదేహం మిస్టరీని త్రిపురారం పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మృతురాలి గుర్తింపుతో పాటు హత్యకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలానికి చెందిన తిరుపతమ్మగా గుర్తించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం పరిసరాల్లో లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అనుమానితుడు లింగప్పను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.
తిరుపతమ్మతో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపిన నిందితుడు, వ్యక్తిగత విభేదాల కారణంగానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం ముందుగా తిరుపతమ్మ చేతులను కట్టి, అనంతరం చీరతో గొంతు బిగించి హత్య చేశాడు. నేరాన్ని దాచిపెట్టే ఉద్దేశంతో మృతదేహానికి రాయి కట్టి బావిలో పడేశాడు. నిందితుడి వద్ద నుంచి మృతురాలికి చెందిన సెల్‌ఫోన్, తాళిబొట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.






