ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ ఖమ్మంలోని ఆసుపత్రిలో ఉన్న తమ స్నేహితుడిని పరామర్శించాడని వెళ్లారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్
X

దిశ, చింతకాని: మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ ఖమ్మంలోని ఆసుపత్రిలో ఉన్న తమ స్నేహితుడిని పరామర్శించాడని వెళ్లారు. అనతంరం తిరిగి బైక్‌పై చింతకానికి వస్తుండగా, ఉదయం సుమారు 4:00 గంటల సమయంలో పందిళ్లపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో బోనకల్ నుండి ఖమ్మం వైపు వస్తున్న ఇసుక టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న వారి బైక్‌ను ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో మాతంగి నాగరాజు తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, లింగాల మహేందర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, టిప్పర్ డ్రైవర్ తోట వెంకటేశ్వర్లు(32) వృత్తి డ్రైవర్, నివాసం కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వీరేందర్ తెలిపారు.

Next Story