- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారును వెనుక నుంచి ఢీ కొట్టిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు
by Batti.Sumithra |
ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు కారును వెనుక నుండి బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

X
దిశ, చౌటుప్పల్ : ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు కారును వెనుక నుండి బలంగా ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జు అయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సూర్యాపేట డిపోకు చెందిన ఎలక్ట్రికల్ జేబీఎం ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళుతుండగా పంతంగి టోల్ ప్లాజా చేరుకున్న సమయంలో ముందుగా వెళుతున్న టాటా నెక్సాన్ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కారు వెనక సీట్లు కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా డ్రైవరు కూడా గాయపడడంతో సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






