- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ ఛాంపియన్‌గా సింగరేణి
ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు సరికొత్త రికార్డు సృష్టించి, విశ్వవిజేతగా నిలిచింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ జట్టు సరికొత్త రికార్డు సృష్టించి, విశ్వవిజేతగా నిలిచింది. జాంబియాలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో చైనా, కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, కొలంబియా వంటి దిగ్గజ దేశాల జట్లను వెనక్కినెట్టి, భూగర్భ రెస్క్యూ విభాగంలో సింగరేణి జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్‌తో కలిసి రెస్క్యూ జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. తాము సాధించిన ట్రోఫీలు, మెడల్స్‌ను డిప్యూటీ సీఎంకు చూపించగా, ఆయన జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. భూగర్భ గనుల రక్షణలో తామెప్పుడూ అగ్రగామినే అని సింగరేణి ప్రపంచ వేదికపై నిరూపించిందని భట్టి కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు అసమానమైనవని, సింగరేణిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.






