TRSలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు

by Jakkula.Mamatha |

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ జావిద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

TRSలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ జావిద్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మజీద్, భాస్కర్ గౌడ్‌లు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన షేక్ రహీం, మహమ్మద్ ఇమ్రాన్,షేక్ సాజిద్, యువ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవితక్క నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని వారు తెలిపారు.

Next Story