- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి దందా పై ఈగల్ కి సమాచారం ఇవ్వండి
హైదరాబాద్ నగరంలో గంజాయిని తెగ పీల్చుతున్నారు. స్థానికంగా న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1908, వాట్సాప్ నెంబర్ 8712671111 ప్రజలు సమాచారం ఇవ్వడంతో ఈగల్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్ అపరేషన్ ను నిర్వహించారు.

దిశ, సిటీ క్రైం : హైదరాబాద్ నగరంలో గంజాయిని తెగ పీల్చుతున్నారు. స్థానికంగా న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1908, వాట్సాప్ నెంబర్ 8712671111 ప్రజలు సమాచారం ఇవ్వడంతో ఈగల్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి స్పెషల్ అపరేషన్ ను నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ తో పాటు జగద్గీర్ గుట్ట ప్రాంతంలో గంజాయి సేవించిన వారితో ఇబ్బందులు తలెత్తున్నాయని ఫిర్యాదు చేయడంతో ఈగల్ రంగంలోకి దిగింది. నాంపల్లి, జగద్గీర్ గుట్ట పోలీసులతో కలిసి ఈగల్ డ్రగ్స్ టెస్ట్ కిట్స్ లతో అనుమానితులకు పరీక్షలను నిర్వహించింది. దీంతో 13 మంది వినియోగదారుల, 2 సప్లయర్ లు దొరికిపోయారు. వీరిని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులను నమోదు చేసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ దందాకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు ఈగల్ కు అందించాలని అధికారులు కోరుతున్నారు.






