ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు

by Nallavelli.Anjaneyulu |

పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామమైన ఉల్పరలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.

ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు
X

దిశ, వంగూర్ : పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామమైన ఉల్పరలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో విధి నిర్వహణలో ఉండగా.. పిడుగుపాటుకు గురై రాజు మృతి చెందడంతో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించిన అంత్యక్రియ ల్లో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటే శ్వర్లు పాల్గొని రాజు పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ శాఖ తరపున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాజు కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరిగిన కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐలు ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీ, ఉప్పునుంతల ఎస్సై మహేష్‌తో పాటు జిల్లా పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని రాజుకు ఘన అంతిమ నివాల్లో వీడ్కోలు అర్పించారు.

Next Story