రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు మృతి

by Batti.Sumithra |

అతివేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు మృతి
X

దిశ, షాద్‌నగర్ : అతివేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం షాద్‌నగర్ పట్టణ సమీపంలోని లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో పాత జాతీయ రహదారి పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగంగా, అజాగ్రత్తగా బైక్ పై వెళ్తున్న మైనర్ బాలురు ముందుగా ఓ జేసీబీని ఢీ కొట్టి, అనంతరం ఎంఎస్‌ఎన్ పరిశ్రమ బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయస్సు సుమారు 16 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న షాద్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story