సోమిరెడ్డి నేత్ర‌ దానంతో ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగు.

by Batti.Sumithra |

మండలంలోని ఇర్సులాపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సోమిరెడ్డి (60) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.

సోమిరెడ్డి నేత్ర‌ దానంతో ఇద్ద‌రి జీవితాల్లో కొత్త వెలుగు.
X

దిశ, బయ్యారం : మండలంలోని ఇర్సులాపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సోమిరెడ్డి (60) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖమ్మం పట్టణానికి చెందిన నేత్రనిధి ఆర్గనైజషన్ కి నేత్రాలను దానం చేశారు. ఈ దానం ద్వారా మరొ ఇద్దరికి చూపు కలిగే అవకాశం ఉండటం గొప్ప విషయమని నేత్రనిధి సభ్యులు పేర్కొన్నారు. సోమిరెడ్డి నేత్రదానం చేసి తన మరణానంతరం మరో వ్యక్తికి ఈ లోకాన్ని చూసే మహత్తర అవకాశాన్ని కల్పించారని ఆ కుటుంబానికి స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి భార్య జ్యోతి, కుమారులు యశ్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నేత్రనిధి బాద్యులు అనంత పద్మనాభం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story