ఇరిగేషన్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు

by Nallavelli.Anjaneyulu |

చందలా పూర్, ఇర్కోడ్ లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇరిగేషన్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి :   ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : చందలా పూర్, ఇర్కోడ్ లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... నారాయణ రావు పేట మండలం గోపులపూర్ చెక్ డ్యాం, చిన్నకోడూరు మండలం కస్తూరి పల్లి గ్రామం వద్ద చెక్ డ్యాంల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. మెట్టపల్లి గుండ్ల చెరువుకు వెళ్లే బ్రిడ్జి పనులు, రాఘవాపూర్ ఇంద్ర గూడెం పల్లె కుంట పనులు, ముండ్రాయి మెరుపు కుంట పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రంగనాయక సాగర్ నుంచి అనంత సాగర్ కు వచ్చే యాసంగికి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి అల్లీపూర్ కర్ణాల కుంట కు నీళ్లు వచ్చే విధంగా లిప్ట్ కు ప్రతిపాదనలు పంపించాలన్నారు. నారాయణ రావు పేట మండలంలో మల్క చెరువు వద్ద ఎల్ఎంసీ ఆర్ డీ 8 నుంచి పైప్ లైన్ వేస్తే సాగు నీరు అందించే వీలు ఉంటుందన్నారు. రంగాయపల్లి కెనాల్ లైనింగ్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే 4ఆర్ కాలువ లో భాగంగా రాఘవాపుర్ కన్నయ్య కుంటకు శాశ్వత కాలువ నిర్మాణం చేపట్టాలన్నారు. పాలమాకుల ఊర చెరువు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలన్నారు. నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా వానాకాలం సీజన్ కు రైతు లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఈ సుధా కిరణ్, ఈఈ లు వీర స్వామి, రమేష్ జాదవ్, శంకర్, మరియు సదయ్య, డీఈ, ఏఈ లు పాల్గొన్నారు.

Next Story