కుట్రలను అడ్డుకోండి.. నేతలు, కార్యకర్తలకు సజ్జల పిలుపు

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని , అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు, కార్యకర్తలు పోరాటం చేయాలని ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

కుట్రలను అడ్డుకోండి.. నేతలు, కార్యకర్తలకు సజ్జల పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని, అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు, కార్యకర్తలు పోరాటం చేయాలని ఆ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(YCP State Coordinator Sajjala Ramakrisha Reddy) పిలుపునిచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం(Tadepalli YCP Central Office)లో మైనారిటీ వింగ్(Minority Wing) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారని, డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎలాంటి వివాదాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. 16 వేల ఉద్యోగాలను కూడా కూటమి ప్రభుత్వం సరిగా భర్తీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. SIR ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. YSRCP అనుకూల ఓట్లను తొలగించే కుట్రలను అడ్డుకోవాలన్నారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Next Story