- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వర్షాలకు ముందే వడ్లు కొనండి’.. అధికారులకు సీఎస్ రామకృష్ణారావు కీలక ఆదేశాలు
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం వరి కొనుగోలు ప్రక్రియ, జూన్ 9న జరిగే మండల మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడిఓసి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కలిసి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తూకం వేసిన వడ్లు వెనువెంటనే లారీల్లో మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు.
రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాల్లోని అన్ని బస్సులు ఆయా మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులను తీసుకుని సాయంత్రం 4 గంటల లోపల హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కి చేరుకునే విధంగా చూడాలని సూచించారు. మహిళలకు మార్గమధ్యలో భోజనాలు, తాగు నీరు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డి సి ఓ ప్రేమ్ కుమార్, డీఎం సివిల్ సప్లై అధికారి త్రినాథ్ బాబు, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపర్నెంట్ వెంకటరమణ, విద్యా శాఖ ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






