మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి : సీపీ సాయి చైత‌న్య

by Nallavelli.Anjaneyulu |

శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని సీపీ పి. సాయి చైత‌న్య గుర్తు చేశారు

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి :  సీపీ సాయి చైత‌న్య
X

దిశ, ఆర్మూర్ : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో శనివారం శ్రీ సాయి గార్డెన్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పొలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వర అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. నేరాల నియంత్రణకు ఉపకరిస్తూ , నేరాలు జరిగిన సందర్భాలలో నిందితుల ఆచూకి తెలుసుకునేందుకు ఉపకరించే సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని , సైబర్ నేరగాళ్ల నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చిన వారికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సంబంధిత విలేజ్ పోలీస్ ఆఫీసర్ సంబంధించిన అధికారికి సంప్రదించగలరు. లేదా విలేజ్ పోలీసు ఆఫీసర్ నెంబర్ అయిన ఇవ్వగలరు. మత్తు పదార్థాలు , దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని , ప్రజలకు భద్రతా కల్పించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా సమాయత్తంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ , ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ గోనె లహరి రఘు , వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి , అగ్రికల్చర్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

Next Story