- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్లను నిందించడం ఆపండి.. దుమారం రేపుతున్న ఆషికా రంగనాథ్ పోస్ట్
హీరోయిన్ పాత్ర సరిగ్గా లేనప్పుడు విమర్శకులు నటీమణులపైనే నిందలు వేస్తారని ఆషికా రంగనాథ్ అన్నారు.

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బిజీగా ఉన్న ఈ నటి, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతోంది. తాజాగా ఆషికా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోంది. మూవీస్‌లో హీరోయిన్ల పాత్రలు, వారిపై వచ్చే విమర్శల గురించి ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది. హీరోయిన్ పాత్ర సరిగ్గా లేనప్పుడు విమర్శకులు నటీమణులపైనే నిందలు వేస్తారని ఆషికా రంగనాథ్ అన్నారు. "కథ రాసేటప్పుడే మహిళా పాత్రలను పక్కన పెట్టేయడం లేదా వాటిని సరిగ్గా డిజైన్ చేయకపోవడం అసలు సమస్య. అంతే తప్ప నటీమణుల తప్పు ఏమీ లేదు. డైరెక్టర్లు తమకు ఇచ్చిన పరిధిలోనే వాళ్ళు నటిస్తారు. రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ల సరసన కేవలం డబ్బు కోసమే హీరోయిన్లు నటిస్తున్నారని కొందరు విమర్శిస్తుంటారు.
కానీ ఈ పెద్ద సినిమాల వెనుక ఉండే బిజినెస్ మార్కెట్ గురించి ఎవరూ ఆలోచించరు. ఇక నుంచి అయినా నిందించడం ఆపండి" అని ఆమె చెప్పారు. తెలుగు వంటి పెద్ద పాన్-ఇండియా సినిమాల్లో నటించడం అనేది హీరోయిన్లకు తమ నటనను నిరూపించుకునే అవకాశం కంటే, కెరీర్‌లో పైకి ఎదగడానికి ఒక ప్లాన్ లాంటిదని ఆషికా అభిప్రాయపడ్డారు. "భారీ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ బొమ్మ లాగా మాత్రమే మారిపోతోంది. ఆమె పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం కంటే, హీరో ఇమేజ్‌ను మరింత పెంచేలాగే ఆ పాత్రలను జాగ్రత్తగా రాస్తున్నారు" అని ఆషికా రాసుకొచ్చారు. ఆషికా రంగనాథ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఆషికా చేసిన ఈ వ్యాఖ్యలు.. జాన్వీ కపూర్‌కు మద్దతుగా చేసినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.






