- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి /కేటీ దొడ్డి : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మహిళా సమైక్య భవన నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలనే దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కేటీదొడ్డి మండలం విద్యా రంగంలో మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి యంగ్ ఇండియా స్కూల్‌తో పాటు ఎస్టీ గురుకుల పాఠశాలను కూడా కేటాయించినట్లు వెల్లడించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని ఆధునిక సౌకర్యాలతో స్కూల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో స్థానిక విద్యార్థులు మెరుగైన విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు అన్ని వసతులు ఒకే చోట అందుబాటులో ఉంటాయని చెప్పారు.
వ్యవసాయ, వ్యాపార రంగాల అభివృద్ధితో పాటు విద్యా రంగ ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారని ఆయన తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, జిల్లా సీనియర్ నాయకుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబురామన్ గౌడ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ నారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్ శెట్టి పాల్గొన్నారు.






