- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
108 సిబ్బంది చాకచక్యంతో అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం
సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఓ గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడారు.

దిశ, మహమ్మదాబాద్ : సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఓ గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడారు. మహమ్మదాబాద్ మండలంలోని కోలింపల్లి గ్రామానికి చెందిన అనూష (21) ప్రసవ వేదనతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సేవలను ఆశ్రయించారు. అంబులెన్స్‌లో గర్భిణిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులు తీవ్రతరమయ్యాయి. దీంతో ఈఎంటీ ఇర్ఫాన్ వెంటనే పరిస్థితిని అంచనా వేసి అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. పూర్తి గర్భకాలం పూర్తయిన అనంతరం అనూషకు సాధారణ ప్రసవం ద్వారా పండంటి మగబిడ్డ జన్మించాడు. ప్రసవం అనంతరం తల్లి, శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించి ఇద్దరినీ క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా సేవలందించిన ఈఎంటీ ఇర్ఫాన్, పైలట్ చాంద్ పాషాలను స్థానికులు అభినందించారు. 108 అంబులెన్స్ సేవలు మరోసారి ప్రాణరక్షకంగా నిలిచాయని గ్రామస్తులు పేర్కొన్నారు.






