జోరుగా దూసుకెళ్తున్న ‘రణబాలి’ షూటింగ్.. మూవీ మేకర్స్ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

ఈ చిత్రానికి సంబంధించిన 90% (తొంభై శాతం) టాకీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

జోరుగా దూసుకెళ్తున్న ‘రణబాలి’ షూటింగ్.. మూవీ మేకర్స్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాల్లో ‘రణబాలి’ ఒకటి. ఇందులో ఆయన భార్య రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. టీ సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది 19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రాబోతోంది. తాజాగా, ‘రణబాలి’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి సంబంధించిన 90% (తొంభై శాతం) టాకీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలోని చారిత్రక ప్రాంతమైన గండికోటలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ లో కూడా చేస్తు్న్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

Next Story