- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి..
కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్లను నిలబెట్టాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని కోరారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కాంట్రాక్టర్లను నిలబెట్టాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యమూర్తి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను ఎటువంటి ప్రభావాలు, సిఫారసులు, వివక్ష లేకుండా క్రమ పద్ధతిలో చెల్లింపు చేయాలని సంవత్సరాలుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతూ కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
కాంట్రాక్టర్లకు బిల్లు ఆలస్యం ఆవ్వడం వల్ల కాంట్రాక్టర్లకే కాకుండా కాంట్రాక్టర్లపై ఆధారపడ్డ వేలాదిమంది ఉద్యోగులు, ఇంజనీర్లు, సూపర్వైజర్లు,అకౌంటెంట్లు, యంత్రాల ఆపరేటర్లు, డ్రైవర్లు, కార్మికులు నిర్మాణ సామాగ్రిస్ సరఫరాదారులు అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల హక్కులను కాపాడేందుకు, వారి డిమాండ్ల పరిష్కారం కోసం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ చైర్మన్లు బి. సుగుణాకర్ రావు, కటుకూరి దేవేందర్ రెడ్డి, యు సురేందర్, అడ్వైజర్ ప్రభాకర్ రెడ్డి, జనగాం సెంటర్ ఫాస్ట్ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మన్ ఈ. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.






