- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ పనులు పూర్తి..! భక్తులకు తీరనున్న ప్రయాణ కష్టాలు
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు త్వరలోనే ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు త్వరలోనే ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం లకుడారం - దుద్దెడ మధ్య నిర్మిస్తున్న ‘కొమురవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్’ పనులు 99 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో (ట్విట్టర్ వేదికగా) వెల్లడించారు.
రూ. 5.63 కోట్లతో సర్వాంగ సుందరంగా..
2024 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును రూ. 5.63 కోట్ల వ్యయంతో అత్యంత వేగంగా పూర్తి చేశారు. ప్రయాణికుల కోసం ఈ స్టేషన్‌లో పలు ఆధునిక వసతులు కల్పించారు. 450 మీటర్ల పొడవైన హై-లెవల్ ప్లాట్‌ఫారమ్, 5 షెల్టర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, తాగునీటి వసతి, మహిళలు, పురుషులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, మెరుగైన అప్రోచ్ రోడ్లు, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆర్కిటెక్చరల్ ఎలివేషన్, మల్లన్న స్వామి, స్థానిక ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రాలు (Mural Paintings) రూపొందించారు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం..
ఈ సరికొత్త రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తులు మల్లన్న క్షేత్రానికి సులభంగా, నేరుగా చేరుకునే సౌలభ్యం కలుగుతుంది. రాజీవ్ రహదారికి (SH-1) సమీపంలో ఉండటం వల్ల ప్రయాణం మరింత సజావుగా సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటమే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటకానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






