- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటిసారి కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమానికి షాకింగ్ రిప్లై!
మాకోసం రెండు కుకీస్ పంపించవా? అని సరదాగా అడిగాడు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం కామెడీ మీమ్‌ను జత చేస్తూ.. అడ్రస్ పెట్టు.. ఫాస్టుగా అడ్రస్ పెట్టు! అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌లోనే కాకుండా వంట చేయడంలోనూ కూడా దిట్ట. ఆయన చేసే బిర్యానీ, నాటుకోడి కూర తిన్న ఇండస్ట్రీ ప్రముఖులు ఎందరో ఎన్టీఆర్ చేతి వంటను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. షూటింగ్‌కు కాస్త గ్యాప్ దొరికినా ఎన్టీఆర్ కొత్త వంటలు చేస్తూ ఫ్యామిలీతో గడుపుతుంటారు. తాజాగా ఆయన మొదటిసారి తన ఇంట్లో కుకీస్ తయారు చేసి, ఆ ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన సాయి తేజ అనే ఒక అభిమాని.. అన్నా, మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాకోసం రెండు కుకీస్ పంపించవా? అని సరదాగా అడిగాడు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘కింగ్’ సినిమాలో బ్రహ్మానందం కామెడీ మీమ్‌ను జత చేస్తూ.. అడ్రస్ పెట్టు.. ఫాస్టుగా అడ్రస్ పెట్టు! అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. స్టార్ హీరో నుండి ఊహించని విధంగా రిప్లై రావడంతో ఆ అభిమాని షాక్‌కు గురయ్యాడు.
నా కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి.. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా.. నా జన్మ ధన్యమైంది అని చెప్తూ తన అడ్రస్ పెట్టాడు. అన్నట్లుగానే ఎన్టీఆర్ ఆ అభిమాని ఇంటికి కుకీస్ పంపించి పెద్ద సర్‌ప్రైజ్ చేశారట. ఇదే క్రమంలో మరో నెటిజన్ స్పందిస్తూ.. "బిర్యానీ, నాటుకోడి వండే టైగర్ ఏంటి.. కుకీస్ వండుతోంది?" అని అడిగాడు. దానికి ఎన్టీఆర్ మళ్లీ బ్రహ్మానందం స్టైల్‌లోనే.. "మారాయ్.. అన్నీ మారాయ్!" అనే డైలాగ్‌ను షేర్ చేశారు. ఎన్టీఆర్ తన అభిమానులతో చేసిన ఈ సరదా సంభాషణ, మీమ్స్ రిప్లైలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. తారక్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్స్‌లోకి రాబోతోంది.






