- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ మార్పు: వైభవ్ సూర్యవంశికి చోటు
ఆసియా గేమ్స్ 2026 కోసం బీసీసీఐ సరికొత్త టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశికి చోటు దక్కింది.

దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో జపాన్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ 2026 కోసం టీమ్ఇండియా జట్టును ఈ రోజు బీసీసీఐ ప్రకటించింది. గతంలో ఉన్న సూర్య కుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్యలకు కాకుండా శ్రేయస్ అయ్యర్ కు భారత జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. అలాగే ఐపీఎల్ 2026 లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశికి తుది జట్టులో స్థానం కల్పించింది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షదీప్ సింగ్, శివమ్ దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ లకు చోటు దక్కింది. ఇదే జట్టు త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్, ఐర్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లోను పాల్గొననుంది. ఇదిలా ఉంటే తాజా జట్టులో అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ మినహా అంతా యువ ప్లేయర్లే కావడం గమనార్హం






