- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త అప్‌డేట్.. Instagram Plus
ఇన్‌స్ట్రాగ్రామ్ మరో అప్‌డేట్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో అందుబాటులోకి వచ్చింది.

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మరో అప్డేటింగ్ న్యూస్.. ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం కొత్త సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పేరుతో Instagram Plusను కూడా అందుబాటులోకి తెచ్చింది. వరల్డ్‌వైడ్ నెలకు రూ. 340 ($3.99), భారత దేశంలో అయితే నెలకు రూ. 99 చొప్పున చెల్లించి, ఎవరైనా దీనిని వినియోగించుకోవచ్చు. అయితే దీనిని కచ్చితంగా అందరూ యూజ్ చేసుకోవాలనేం లేదు. కేవలం ఆప్షనల్ మాత్రమే. దీంతోపాటు ఎప్పటిలాగే సాధారణ ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగం కూడా పూర్తి ఉచితంగా కొనసాగుతుంది. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్ స్క్రైబర్లకు ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ఇన్‌స్ట్రాగ్రామ్ ఈ కొత్త ఫీచర్‌ను జూన్ 4, 2026న గ్లోబల్‌గా రోల్ అవుట్ చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ (Android), ఐవోఎస్ (iOS) డివైజ్‌లలో అందుబాటులో ఉంది. ఒకవేళ కనిపించకపోతే మీ Instagram యాప్‌ను అప్‌డేట్ చేసి, Settings → Instagram Plus చెక్ చేసుకోవచ్చు. ఈ సబ్ స్ర్కిప్షన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో Story Rewatch Insights ఆప్షన్ ఉంది. దీంతో వినియోగదారులు తమ స్టోరీలను ఎంతమంది ఎన్నిసార్లు రీవాచ్ చేశారో వివరంగా చూడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రొఫైల్ కస్టమైజేషన్ ఆప్షన్లు, అడిషనల్ స్టోరీ టూల్స్, వ్యూయర్ సెర్చ్, ఎక్స్‌టెన్సివ్ అకౌంట్ ఇన్‌సైట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి. మొత్తానికి ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫామ్‌ను మరింత అట్రాక్టివ్‌గా, యూజ్‌ఫుల్‌గా మార్చాలని భావిస్తోంది. అదనపు ఫీచర్లు కావాలనుకునేవారికి మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.






