- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామ సభపై అధికారులను నిలదీసిన పిన్నాయిపాలెం ప్రజలు
పిన్నాయిపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ గ్రామసభలో అధికారులపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, సూర్యాపేట రూరల్: సూర్యాపేట మండలలోని పిన్నాయిపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ గ్రామసభలో అధికారులపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభను ఉదయం 8 గంటలకు నిర్వహిస్తామని ముందుగా అధికారులు ప్రకటించినప్పటికీ, సభను ఉదయం 9:30 గంటలకు ప్రారంభించడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సరైన సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడం ఏంటని అధికారులు వద్ద గ్రామస్తులు నిలదీశారు. గ్రామపంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించిన ప్రజలకు ఆయన సరైన సమాధానం చెప్పలేక తడబడినట్లు గ్రామస్తులు తెలిపారు.
చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్..
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ పబ్బు వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, గ్రామసభ ఉందని తనకు కూడా ఈ రోజు ఉదయమే సమాచారం ఇచ్చారని తెలిపారు. గ్రామంలోని 8 మంది వార్డు సభ్యుల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్పెషల్ ఆఫీసర్ సైతం గ్రామపంచాయతీ అధికారుల వ్యవహారంపై స్పందించకపోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం గమనార్హమని గ్రామస్తులు విమర్శించారు. గ్రామ ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించడం సరైంది కాదని, ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.






