- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెలను ఢీకొట్టిన తుఫాన్..
44 జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెలను తుఫాన్ అతివేగంతో ఢీకొట్టడంతో గొర్రలు మృతి చెందాయి.

దిశ, ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో శనివారం 44 జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెలను కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న తుఫాన్ అతివేగంతో ఢీకొట్టింది. దీంతో తిమ్మాపురం గ్రామానికి చెందిన శివ అంజనమ్మకు 20 గొరెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు 2,00,000 ఉంటుందని కన్నీటి పర్యంతమైన యజమాని, విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (TGSGDCFL) చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీమతి సరిత తిరుపతయ్య తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
బాధిత కుటుంబానికి...
ప్రమాద వివరాలను తెలుసుకొని పశుసంవర్ధక శాఖ అధికారులకు, వెటర్నరీ వైద్యాధికారులకు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అలాగే జరిగిన నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీమతి సరిత తిరుపతయ్య మాట్లాడుతూ, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలకు ఇలాంటి ఘటనలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.






