బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే

by Pulgam srinivas |

‘పెద్ది’ సినిమా మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 181.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తయింది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 181.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు రావడంతో, వీకెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించగా, సంగీతాన్ని ఏ. ఆర్. రెహమాన్ అందించారు.




Next Story