- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్ల గ్రామ అభివృద్ధికి తొలి అడుగులు..
గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై చర్ల పంచాయతీ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బానోత్ రాంబాబు ప్రత్యేక దృష్టి సారించారు.

దిశ, చర్ల: గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై చర్ల పంచాయతీ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బానోత్ రాంబాబు ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలోని డ్రైన్ల పూడిక తొలగింపు, పరిశుద్ధ పనులను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, ప్రతిరోజూ ఉదయం వచ్చే చెత్త బండిలో వేయాలని కోరారు. అలాగే గ్రామంలోని వ్యాపారులు, షాపు యజమానులు తమ చెత్తను రోడ్లపై పడేయకుండా ప్రత్యేక చెత్త బాక్స్‌లలో సేకరించి పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రజలందరూ పంచాయతీకి సహకరించాలని, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని బానోత్ రాంబాబు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో చర్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.






