రెండో అంతస్తు నుంచి కింద పడ్డ లిఫ్ట్.. ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

by Malleboina Mahesh |

మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బర్త్‌డే వేడుకల్లో ప్రమాదం. రెండో అంతస్తు నుంచి కిందపడ్డ లిఫ్ట్. ప్రమాద సమయాల్లో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.

రెండో అంతస్తు నుంచి కింద పడ్డ లిఫ్ట్.. ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavampalli Satyanarayana)కు ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కూడా ఉన్నారు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు (బర్త్‌డే) వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు.

వేడుకలు ముగించుకుని భవనంలోని రెండో అంతస్తు నుంచి వారు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లిఫ్ట్ ఒక్కసారిగా నేరుగా కిందకు పడిపోయింది. లిఫ్ట్ కిందపడిన శబ్దానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అనుచరులు లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు నేతలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story