మరో లవ్ స్టోరీతో రాబోతున్న హర్ష రోషన్.. ఆకట్టుకుంటున్న ‘తెల్లకాగీతం ఫస్ట్ లుక్

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది.

మరో లవ్ స్టోరీతో రాబోతున్న హర్ష రోషన్.. ఆకట్టుకుంటున్న ‘తెల్లకాగీతం ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో హర్ష రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. గత ఏడాది ‘కోర్ట్’ సినిమాతో హీరోగా మారి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించాడు. హీరోగా చేసిన మొదటి మూవీనే ఘన విజయం సాధించడంతో పాటు భారీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘టుక్ టుక్’తో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇటీవల గ్రామీణ ప్రేమకథ ‘బ్యాండ్‌మేళం’తో వచ్చినప్పటికీ ఆశించినంత స్థాయిలో బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందుకుండా తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘తెల్లకాగితం’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి రమేష్ బ్యాన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీదేవి ప్రజెన్స్, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్స్‌పై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. హర్ష రోషన్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటించనుంది. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా, పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్లు ఒక చెరువు గట్టుపై సైకిల్‌పై వెళ్తూ, ఒకరినొకరు చూసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పోస్టర్ చూస్తుంటేనే ఇదొక స్వచ్ఛమైన, సరికొత్త గ్రామీణ ప్రేమకథ అని అర్థమవుతోంది. ఇక ఈ పోస్టర్‌కు ‘‘ఆ చిన్నపాటి గుండె దడ..ఆ బుగ్గల్లోని ఎరుపు..ఆ తెలియని కంగారు..వీటన్నింటి కలయికే ప్రేమ అనే ఒక అందమైన అయోమయం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు హర్ష రోషన్.

Next Story