- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థర్డ్ పార్టీకి సమాచారం ఇవ్వటం కుదరదట!
సమాచార హక్కు చట్టం 2005 (ఆర్టీఐ) కింద సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది.

దిశ, కొణిజర్ల: సమాచార హక్కు చట్టం 2005 (ఆర్టీఐ) కింద సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలని సంబంధిత కార్యాలయంలో సమాచారం అందుబాటులో లేకపోతే మరో కార్యాలయానికి బదిలీ చేసి దరఖాస్తుదారుడికి లేఖ ద్వారా సమాచారం అందచేయాలని చట్టం చెబుతుంది. చట్టం ఒకలా చెపుతుంటే అధికారులు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆర్టీఐ కింద థర్డ్ పార్టీకి అసలు సమాచారమే ఇవ్వటం కుదరదని చట్టానికే వక్ర భాష్యం చెబుతూ అప్రతిష్టను మూట కట్టుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ప్రతి నెల లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని వేతనంగా తీసుకుంటూ చట్టాలను గౌరవించి అమలు చేయాల్సిన అధికారులే చట్టా అధికారులే చట్టాల అమలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అపహస్యం పాలు చేస్తుంటే... ఇక బాధితులకు దిక్కెవరు అబాగ్యులకు న్వాయం జరిగేదెట్లా? జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్ 2005 కింద సమాచారం కోసం దరఖాస్తు చేసి మూడు నెలలు గడిచినప్పటికీ సమాచారం ఇవ్వకపోవటంతో దరఖాస్తు దారుడు కార్యాలయానికి వెళ్ళి పీఐఓని సంప్రదించాడు.
ఆర్టీఐ యాక్ట్ పని తీరును...
సర్ నేను సమాచారం కోసం దరఖాస్తు చేసి మూడు నెలలు దాటింది. నాకు నేటి వరకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని పీఐఓని అడగటంతో తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోతు మీరు ఎవరు సర్టిఫికెట్లతో మీకేం పని సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వాలి సర్టిఫికెట్లతో మీకేం సంబంధం థర్డ్ పార్టీకి ఇవ్వటం కుదరదంటూ నిరాకరించారు. పీఐఓ ప్రవర్తించిన తీరు విద్యాశాఖ కార్యాలయంలో ఆర్టీఐ యాక్ట్ పని తీరును తేటతెల్లం చేస్తుందనటంలో ఎలాంటి సందేహాం లేదు. చట్టాలను చట్టు బండలుగా మారుస్తున్న సంబధిత కార్యాలయ అధికారుల తీరును పరిశీలిస్తే... ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మెకాలకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ అన్వర్ పాషా అనే వ్యక్తి ఖమ్మం జయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి సంబధించిన విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పని చేసే పాఠశాల పేరు విధులో చేరిన తేది తదితర వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) కింద 19.02. 2026న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేశాడు.
పీఐఓ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని...
దరఖాస్తు చేసిన 30 రోజులలో దరఖాస్తు దారునికి సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాషలో పేజీని సెక్షన్ 2(j) (ii) ప్రకారం ధృవీకరించి ఇవ్వాలని చట్టం చెబుతుంది. కాని దరఖాస్తు చేసి మూడు నెలల 10 రోజులు గడిచిన సదరు కార్యాలయ అధికారులు స్పందించక పోవటంతో దరఖాస్తు దారుడు 1.07.26న కార్యాలయానికి వెళ్లి సమాచారం కోసం పీఐఓని సంప్రదించాడు. దీంతో సదరు పీఐఓ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని చట్టం అంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శించాడు. ఎవరు నీవు సర్టిఫికెట్ తో నీకేం పని థర్డ్ పార్టీకి సర్టిఫికెట్ ఇవ్వటం కుదరదు అంటూ సమాచార హక్కు చట్టాన్ని నీరు కార్చే విధంగా వ్యవహరించాడు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిహరిస్తూ చట్టాన్ని అపహస్యం పాలు చేస్తున్న సంబంధిత కార్యాలయ పౌర సమాచార అధికారిపై చర్యలు తీసుకోవాలని చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారుడు కోరుతున్నాడు.






