- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనవాసాల మధ్యనే కోతులు...
మంథని మండలంతో పాటు పట్టణంలో ప్రజలకు ఉన్న సమస్యల్లో ఒక్కటి కోతుల సమస్యే ప్రధాన సమస్యగా తయారైంది.

దిశ, మంథని: మంథని మండలంతో పాటు పట్టణంలో ప్రజలకు ఉన్న సమస్యల్లో ఒక్కటి కోతుల సమస్యే ప్రధాన సమస్యగా తయారైంది. కోతులు గుంపులు గుంపులుగా జనవాసాల మధ్యనే తిరుగుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇండ్ల చుట్టూ... ఇండ్లల్లోకి వచ్చే దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇకా సాయంత్రం తర్వాత చెట్లపై సేద తిరుతున్నాయి. అయితే వాటికీ ఆహారం దొరక్క ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. కోతుల వల్ల భయం భయంగా తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని... బిక్కు బిక్కు మనే పరిస్థితి ఉందని అంటున్నారు ప్రజలు. మంథని పట్టణంలో ఉన్న అయ్యప్ప టెంపుల్, గణపతి టెంపుల్, హనుమాన్ టెంపుల్, బిక్షేశ్వరా స్వామి ఆలయం, మహాలక్ష్మి ఆలయం.... చుట్టూ చెట్ల పై కోతులు హంగామా చేస్తున్నాయి. ఉదయం గుడి వెళ్లే భక్తుల వెంబడిస్తున్నాయి. దీంతో కోతులు వారికీ పెద్ద సమస్యగా మారిందంటున్నారు. కోతుల నుండి తమను రక్షించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను జనాలు వేడుకుంటున్నారు.
కోతుల దాడి... పలువురు గాయాలు...
కోతులు దాడి చేయడం వల్ల గ్రామాల్లో, పట్టణంలో పలువురికి గాయల పాలయ్యారు. టూ వీలర్ వాహనదారులు అయితే... కోతుల వల్ల ప్రమాదానికి గురై కాళ్ళు, చేతులు కూడా విరిగి ప్రాణ పాయ స్థితి నుండి బయట పడిన సందర్బలు కూడా ఉన్నాయి. అదే విధంగా పెను ప్రమాదాలు నుండి బయట పడ్డారు. రోజు రోజుకి ఈ కోతుల బీభత్సవం ఎక్కవైంది.ప్రజల మీద పడి పీక్కు తినేలా తయారయ్యాయి. దండు వలె గుంపులతో వస్తు... దాడులు చేస్తున్నాయి. ఉదయం నుండి పడుకునే వరకు కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ... బైక్ మీద వెళ్లాలంటే ప్రజలు భయం గుప్పిట్లో పెట్టుకుంటూ... వెళ్ళుతున్నారు.కోతుల సమస్య నుండి ఎన్నడూ విముక్తి కలుగుతుందోనని జనాలు తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు.
రోడ్ల పైనే పశువులు, కుక్కలు, సాయంత్రం పశువుల సంత...
పట్టణంలోని ప్రధాన రహదారిపై సాయంత్రం నుండి రాత్రి వరకు రోడ్ల పై పశువులు తిరుగుతున్నాయి. బస్సు డిపో, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పెట్రోల్ బంక్ ఏరియాలతో పట్టణం చుట్టూ పశువులు తిరుగుతున్నాయి. దీంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల పై ఉండడం వలన ప్రమాదలు కూడా జరుగుతున్నాయి. షాపుల ముందు ఇండ్ల వద్ద ఈ పశువులు రావడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాక కుక్కలు కూడా పట్టణంలో రోడ్ల పై తిరుగుతున్నాయి. వీటి వలన వాహనదారులు పలువురు ఇబ్బందులు పడుతున్నారు. మంథని పట్టణం సాయంత్రం పశువుల సంతగా మారిందని మండిపతున్నారు ప్రజలు. మున్సిపల్ పాలక వర్గం, మున్సిపల్ అధికారులు వీటిపై చర్యలు చేపట్టి వీటి నుండి విముక్తి కలిగించాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.






