- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కరీంనగర్‌లో ఘోర ప్రమాదం: తెగిపడ్డ లిఫ్ట్.. లోపలే ఇరుక్కున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే!
కరీంనగర్‌లో ఘోర ప్రమాదం: తెగిపడ్డ లిఫ్ట్.. లోపలే ఇరుక్కున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే!
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మానకొండూర్ ఎమ్యెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్‌లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: మానకొండూర్ ఎమ్యెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటున్న మాజీ ఎమ్యెల్యే ఆరెపల్లి మోహన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రెండవ ఫ్లోర్‌లో నుండి లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఒక్కసారిగా రెండవ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు తెగి పడిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన కవ్వపంల్లి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్‌లు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద ఘటనలో కవ్వంపల్లి ఆరెపల్లితో పాటు మరో ఆరుగురు లిప్టులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లిఫ్ట్ పరిమితికి మించి లిప్టులో ఎక్కడం మూలంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
Next Story






