గన్నవరం-సింగపూర్‌ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం: ఆలస్యంగా టేకాఫ్

by Ramesh Naini |

గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

గన్నవరం-సింగపూర్‌ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం: ఆలస్యంగా టేకాఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి చేరుకున్న క్రమంలో లోపాన్ని గుర్తించి కొద్దిసేపు అక్కడే నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావుతో సహా మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నారు.

అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సాంకేతిక సిబ్బంది తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. దీంతో ఉదయం 9.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం.. సమస్య పరిష్కారం కావడంతో కాస్త ఆలస్యంగా సింగపూర్‌కు సురక్షితంగా టేకాఫ్‌ అయ్యింది. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story