- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడి స్టేట్ మెంట్ రికార్డు
గండిపేట భూముల కబ్జా కేసులో హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును తమిళనాడులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గండిపేట భూముల కబ్జా కేసు(Gandipet land encroachment case)లో సైబరాబాద్ పోలీసులు(Hyderabad Cyberabad Police) వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును(Hyderabad Cyberabad Police) తమిళనాడులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను ఈ రోజు హైదరాబాద్ సీపీ ఆఫీసుకు తీసుకొచ్చారు. భూ కబ్జాపై ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. వెల్ది రాధాకృష్ణ, నిమ్మల దశరథ కుటుంబంతో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీశారు. గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కడపకు చెందిన వైసీపీ నేతతో జరిగిన లావాదేవీలపైనా ఆయన్ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం బొల్లా బ్రహ్మనాయుడు వాంగ్మూలం నమోదు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడును మరికాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
Next Story






