ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్

by Kodari Anjali |   (  Updated:2026-06-06 07:37:23  IST  )

బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్
X

దిశ, మిర్యాలగూడ: బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్‌ను శనివారం అరెస్టు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్.. సప్లమెంటరీ రిపోర్టు ఈఓ (EO) కి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి వల పన్ని ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్‌ను పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎస్కే మహమూద్‌ను అరెస్ట్ చేసిన అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని మందుల వారి కాలనీలో గల మహమూద్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story