- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకి రాజీనామా చేశాక.. కాంగ్రెస్‌ను ఎంచుకోవడానికి రీజన్ అదే: CM రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, తన రాజకీయ ప్రస్థానం మరియు పరిపాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, తన రాజకీయ ప్రస్థానం మరియు పరిపాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతూ.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక బలమైన పోరాటం జరగాలని తెలంగాణ ప్రజలు బలంగా ఆశించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను తెలుగుదేశం పార్టీ (TDP)కి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. "టీడీపీ వీడిన సమయంలో నా ముందు రాజకీయంగా ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కానీ, నేను కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఎంచుకున్నాను. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలలను గుర్తించి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణను ఏర్పాటు చేశారు." అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బ్యూరోక్రాట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదే వేదికపై ఐఏఎస్, ఐపీఎస్ వంటి బ్యూరోక్రాట్ల (అధికారుల) పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారులు చాలా తెలివైన వారని (ఇంటెలిజెంట్స్), అందుకే తాను అధికారిక సమావేశాల్లో ఒక ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తానని చెప్పారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే తాను ఏమీ మాట్లాడనని, అధికారులు చెప్పే విషయాలన్నింటినీ నిశితంగా గమనిస్తానని సీఎం పేర్కొన్నారు. మీటింగ్ ముగింపు దశకు (క్లోజింగ్) వచ్చినప్పుడు మాత్రమే తాను మాట్లాడి కీలక నిర్ణయాలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రవాస తెలంగాణవాసులు పాల్గొన్నారు.






