- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి
ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేలా డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థుల ఇంటికి వెళుతున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేలా డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థుల ఇంటికి వెళుతున్నారు. విద్యార్థుల్లో ప్రభుత్వ విద్య పై నమ్మకం కలిగించేలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. నిర్మల్ లో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా శనివారం నుంచి 12 తేదీ దాకా వారం రోజులు పాటు విద్యార్థుల ఎన్రోల్మెంట్ (నమోదు కార్యక్రమం)ను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విదార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో చేరి తమ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని అన్నారు.
తమ కళాశాలలో అంకితభావం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తారని, అధునాతనమైన కంప్యూటర్ లాబ్స్, సైన్స్ లాబ్స్, డిజిటల్ గ్రంథాలయం, నిర్మల్ జిల్లాలోనే అత్యంత విశాలమైన క్రీడా మైదానం, ఎన్సీసీ కలిగిన ఏకైక కళాశాల తమదని, ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందే అవకాశం విద్యార్థులకు ఉందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిర్మల్ జిల్లాలోని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు.గంగాధర్, ఏఓ నాగ శ్రీనివాస్, దోస్త్ కో ఆర్డినేటర్ కుంట శ్రీహరి అధ్యాపకులు డాక్టర్ పిజి రెడ్డి, సూర్య సాగర్, డాక్టర్ శ్రీనివాస్, కట్టా రమేష్ రెడ్డి, డాక్టర్ హేమలత, సుభాష్, డాక్టర్ పవన్, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.






