- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం బిల్లులను వెంటనే విడుదల చేయాలి : గిరిజన సంక్షేమ సంఘం
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత మూడు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాం బిల్లులను 11 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

దిశ, హిమాయత్ నగర్ : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత మూడు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాం బిల్లులను 11 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని గిరిజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. శనివారం హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్పతి నాయక్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మూడు ఏళ్లుగా యూనిఫాం బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత సరఫరాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పెండింగ్‌లో ఉన్న యూనిఫాం బిల్లులను వెంటనే విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సేవాలాల్ బంజారా కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలని, లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు . ఈ సమావేశంలో అమర్ సింగ్ నాయక్, డాక్టర్ ఎస్.పీ. నాయక్, గిరిజన జన సమితి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్, మహిళా నాయకురాలు పుణ్యవతి రాథోడ్, సంగీత నాయక్, ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ పాల్గొన్నారు.






