ఈవీఎం గోదామును తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

by Batti.Sumithra |

హనుమకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవనం వెనుక ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు), వివిప్యాట్‌లు భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.

ఈవీఎం గోదామును తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : హనుమకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్ భవనం వెనుక ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు), వివిప్యాట్‌లు భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఈ పరిశీలన చేపట్టారు. గోదాములో పటిష్ట భద్రత నడుమ భద్రపరిచిన ఈవీఎంలు, వివిప్యాట్‌లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి నిల్వ ఉంచిన గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, గోదాం భద్రతా వ్యవస్థలను సమీక్షించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి.శ్రీనివాసరావు, రావు అమరేందర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, నాగబెల్లి రజనీకాంత్, సయ్యద్ ఫైజుల్లా, మణి, లక్ష్మణ్, ఎం.డీ.నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story