- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేదల పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు.

దిశ, చిన్నశంకంపేట : తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేదల పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాదేశాం ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత కాంగ్రెస్ దేనాన్నరు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు మంజూరు చేసిందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందేమీ లేదని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత, రెండో విడత ఇల్లు లేని లబ్ధిదారులకు మంజూరు చేసి గృహప్రవేశాలకు పంపించినట్లు తెలిపారు. కొర్విపల్లి తండా, టీ మాందాపూర్ తండాలో బోరు మోటార్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మాలతీ, స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, హేమ భానుచందర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు హలావత్ మోహన్ నాయక్, సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ భానుచందర్, పోతరాజు రమణ,సాన సత్యనారాయణ, రాజిరెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, పుల్లారావు, బందెల సాయిలు, సర్పంచులు పుల్లారావు, మూడవ అశోక్ నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






