- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డిని బలిస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
పవన్ కల్యాన్ ప్రెస్ మీట్ రోజున సీఎం రేవంత్ రెడ్డిని బలిఇస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన మద్దతుదారుడిని పోలీసులు అరెస్టుచేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్ నాడు కొర్ర చందర్ లాల్ (Korra Chandar Lal) అనే వ్యక్తి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'జనసేనతో పెట్టుకున్నావ్.. రేవంత్ రెడ్డి నిన్ను బలి ఇస్తాం' అంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రిని 'అ*య్' అంటూ సంభోదిస్తూ రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ సీఎంపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిపై చందులాల్ వ్యాఖ్యలను సీరియస్‍గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ పోలీస్ శాఖ.. సోషల్ మీడియాలో ఎవరైనా మితిమీరిన వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇంగితజ్ఞానం మరిచిపోవద్దని అలా మరిచిపోతే చట్టం పని చట్టం చేస్తుందని హెచ్చరించింది. ఉద్దేశ్యపూర్వకంగా సోషల్ మీడియాలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి పై కేసు (Cr no: 395/2026) నమోదు చేసి జైలుకు పంపించినట్లు పేర్కొంది.






